ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జై జవాన్…జై కిసాన్- రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 10:14 AM

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిం ద్‌ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత జాతికి సైనికులు, రైతులు అంది స్తున్న సేవలను కొనియాడారు. తన ప్రసంగంలో ప్రధానంగా ఆహారభద్రత,సరిహద్దు భద్రత అంశాల ను ప్రస్తావించారు. రైతులు, సైన్యం కష్టాలను గుర్తు చేశారు. సరిహద్దుల్లో విస్తరణాత్మక సవాళ్లను దేశం ఎదుర్కొంటోందని, మన సైనికులు ధైర్యసాహసాలతో వాటిని తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధం గా ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశంలో ఆహారభద్రత కు రైతులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతి భారతీయుడు రైతులకు నమస్కరిస్తున్నాడని, విశాల భారతావనికి ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులపై స్వావలంబన సాధించి పెట్టారని చెప్పారు. ప్రకృతి ప్రతికూలతలు, కొవిడ్‌ మహమ్మారి వంటి ఇతర సవా ళ్లు ఉన్నప్పటికీ మన రైతులు వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగించారని అన్నారు. అదేవిధంగా లడఖ్‌లోని సియాచిన్‌, గాల్వాన్‌ లోయలో ఎముకలు కొరికే చలి లోనూ సైనిక యోధులు అప్రమత్తంగా ఉంటూ సరి హద్దులను రక్షిస్తున్నారని చెప్పారు. భారత్‌ తన సరిహ ద్దుల్లో విస్తరణవాద చర్యను ఎదుర్కొంటున్నది. కానీ, మన పరాక్రమ సైనికులు దానిని విచ్ఛిన్నం చేస్తున్నా రు. మన భద్రతను అణగదొక్కే ప్రయత్నాలను అడ్డు కునేందుకు సైన్యం, వైమానికదళం, నావికాదళం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు.


రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ విలు వలు మన అందరికీ పవిత్రమైనవి. ప్రజలందరూ వాటికి బద్దులై ఉండాలి. న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వ విలువలే మన స్వాతంత్య్ర పోరాటానికి, మార్గనిర్దేశనం చేశాయి.


ఆహార భద్రత, జాతీయ భద్రత, రోగాలు, విపత్తుల నుంచి రక్షణ, వివిధ అభివృద్ధి రంగాలలో తమ సేవల ద్వారా శాస్త్రవేత్తలు దేశ ప్రయోజనాలను పటిష్టం చేశారు. అంతరిక్షం నుంచి పరిశ్రమల వరకు, విద్యా సంస్థల నుంచి ఆసుపత్రులు వర కు శాస్త్రవేత్తల కృషి సమాజాన్ని బలోపేతం చేసిం ది. కరోనా మరణాలను తగ్గించడంలో డాక్టర్లు, అధికార యంత్రాంగం కృషి అమోఘం. తమ ప్రాణాలు పణంగాపెట్టిన 1.5 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నివాళులు


కరోనా వేళ సాంకేతిక విద్య, డిజిటల్‌ న్యాయవ్యవ స్థ, పారదర్శక ఎన్నికలు భారతదేశాన్ని ముందు కు తీసుకెళ్లాయి. ఆర్థిక వ్యవస్థ, ఊ#హంచిన దాని కంటే కూడా త్వరగా కోలుకుంటున్న సూచనలు కనిపించాయి. తాజాగా అసాధారణరీతిలో జి.ఎస్‌.టి. కలెక్షన్‌, విదేశీ పెట్టబడులకు అత్యంత ప్రాధాన్యం గల దేశంగా భారతదేశం ఆవిర్భవిం చడం మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడాన్ని సూచిస్తున్నాయి.


‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’, నూతన విద్యా విధానం దేశానికి కొత్త దిశను చూపుతుంది. సంలీన నూతన భారత సమాజాన్ని నిర్మించడం లో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, నిరుపేదల అభ్యున్నతి, మ#హళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాము.


మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ జాతీయ ప్రయోజనాన్ని రక్షించుకుంటాము. మన దేశాని కి అంతర్జాతీయంగా సముచిత స్థానం లభిస్తోం ది. భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడమే ఇందుకు తార్కాణం.


విదేశాలలోని మన సోదరసోదరీమణులు మన జాతి సంతతి మనకు గర్వకారణం. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు విభిన్న జీవన మార్గా లలో సఫలీకృతులయ్యారు. కొందరు రాజకీయ నాయకత్వంలో అత్యున్నత శిఖరాలకు చేరుకో గా, మరికొందరు విజ్ఞాన శాస్త్రం, కళలు, విద్యా రంగం, పౌర సమాజం, వాణిజ్య రంగానికి తమ సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రవాస భూమికి, అలాగే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com