ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే చిన్న ఫోన్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 06:43 PM

ఫోన్‌.. ఇప్పుడు నిత్యావసరాల్లో ఒకటి. ఇక స్మార్ట్‌ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో మోడళ్లు, మరెన్నో వెరైటీలతో అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిచిన్న మొబైల్‌ను ఎప్పుడైనా చూశారా..? ఎలరీ అనే సంస్థ క్రెడిట్‌ కార్డు కంటే తక్కువ సైజులో ఉండే ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్‌ ఇది అని పేర్కొంటోంది. ఎలరీ నానోఫోన్‌ సీ పేరుతో రూపొందించిన ఈ ఫోన్‌ను ప్రముఖ ఆన్‌లైన్‌ మొబైల్‌ ఆక్సెసరీస్‌ వెబ్‌సైట్‌ యెర్హా.కామ్‌ ద్వారా భారత్‌ మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర రూ. 3,940గా నిర్ణయించింది.


జీఎస్‌ఎం మోడల్‌లో ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్‌ ఇదట. నానోఫోన్‌ సీ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. క్రెడిట్‌ కార్డు కంటే తక్కువ సైజులో ఉంటుంది. బ్లాక్‌, రోస్‌గోల్డ్‌, సిల్వర్‌ రంగులో ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది.


ఫోన్‌ ఫీచర్లు 


- 1 అంగుళం డిస్‌ప్లే
- ఆర్‌టీఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
- మీడియాటెక్‌ ఎంటీ6261డీ చిప్‌సెట్‌
-32 ఎంబీ ర్యామ్‌
-32 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
-మెమొరీ కార్డు ద్వారా 32జీబీ వరకు పెంచుకునే సామర్థ్యం
- 280ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
-ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో, వాయిస్‌ రికార్డింగ్‌ ఫీచర్లు
-బ్లూటూత్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లతో కనెక్ట్‌ చేసుకునే సదుపాయం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com