ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జహీర్‌ ఉన్నా ఆయనే కావాలి: రవిశాస్త్రి

Andhra Pradesh Telugu |   | Published : Thu, Jul 13, 2017, 07:39 PM

 టీమిండియా కొత్త కోచ్‌ రవిశాస్త్రి సహాయక బృందంలో తనకు ఇష్టమైన వారిని నియమించాలని పట్టుపడుతున్నట్టు సమాచారం. క్రికెట్‌ సలహా సంఘం బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. జాక్‌ ఉన్నప్పటికీ మాజీ బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌ కావాలని శాస్త్రి అడుగుతున్నాడట. బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు.


భారత మాజీ క్రికెటర్లు జహీర్‌, ద్రవిడ్‌తో కలిసి పనిచేయడానికి శాస్త్రికేమీ ఇబ్బంది లేదని ఆ అధికారి అన్నారు. ఒప్పందం ప్రకారం జహీర్‌ ఏడాదిలో వంద రోజులే జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఆయన జీత భత్యాలపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. అందుకే రోజువారీ విధుల్లో భరత్‌ తనకు సహాయకారిగా ఉంటాడని శాస్త్రి అభిప్రాయం. అండర్‌-19 నుంచి రోజుల్నుంచి భరత్‌, రవిశాస్త్రి మంచి స్నేహితులు. రవి డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భరత్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అందుకే జహీర్‌ ఉన్నప్పటికీ భరత్‌ కావాలని బీసీసీఐ పాలకుల కమిటీని శాస్త్రి అడగనున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com