ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్లకే తల్లయ్యింది.. తండ్రి ఎవరో చెప్పలేకపోతుంది!

international |  Suryaa Desk  | Published : Sat, Dec 19, 2020, 02:28 PM

కొలంబియాలోని ప్రాడో మునిసిపాలిటిలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన విషయం నెల రోజులు ఆలస్యంగా అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు ఆ బాధితురాలిని, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని వైద్య సంరక్షణ కేంద్రంలో ఉంచారు.
అయితే తనపై జరిగిన దారుణం గురించి, తన బిడ్డకు తండ్రి ఎవరన్న విషయంపై ఆ బాలిక ఏం చెప్పలేకపోతుంది. బాలికకు జరిగిన దారుణం గురించి ఆలస్యంగా వెలుగు చూసిందని ఆ ప్రాంత గవర్నర్‌ రికార్డో ఒరోజ్కో తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టిన వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ బాలిక సవతి తండ్రి(43), పొలాల్లో పని చేసే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com