ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ యూజర్స్‌ కి షాక్.. ఫిబ్రవరి 8 నుండి కొత్త నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 04, 2020, 02:43 PM

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చే వాట్సాప్.. ఇప్పుడు కొత్తగా రాబోయే అప్‌డేట్ ‌తో యూజర్స్‌ కి షాకివ్వబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుండి కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను అంగీకరించని వాట్సప్ వివినియోగదారుల ఫోన్లలో పనిచేయదని వాట్సప్ తన బ్లాగ్ ద్వారా తెలిపింది. కొత్తగా తీసుకురాబోయే టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ని వాబీటాఇన్‌ఫోలో షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ లో కొత్త నిబంధనలను అంగీకరించండి లేదా మీ వాట్సప్ ఖాతాను డిలీట్ చేసుకోండి అని ఉంది. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్ లో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది దానిపై మరింత సమాచారంతో రానున్నట్లు తెలిపింది. అలానే ఫేస్‌బుక్ అందించే అన్ని రకాల సేవలకు సంబంధించిన ఛాటింగ్ సమాచారాన్ని వ్యాపార అవసరాల కోసం ఎలా ఉపయోగిస్తారనేది కూడా అందులో తెలియజేయనున్నట్లు తెలిపింది. అలాగే 2021 ఫిబ్రవరి 8 తర్వాత కొత్తగా తీసుకొచ్చిన టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను అంగీకరించని యూజర్ల వాట్సప్ అకౌంట్ డిలీట్ కానున్నట్లు స్క్రీన్ షాట్ లో తెలిపింది. త్వరలో ఈ కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com