ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Nov 10, 2020, 09:25 AM

మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్‌ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్‌‌ ఫిగర్‌ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com