ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2020: హైదరాబాద్- రాజస్థాన్ సమరంలో గెలుపెవరిది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 05:25 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు దుబాయ్ లో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 12 మ్యాచులు జరగ్గా, హైదరాబాద్ 6, రాజస్థాన్ 6 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా దుబాయ్ లో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.
గెలుపు కోసం
కోల్ కతా తో ఆడిన గత మ్యాచ్ లో సూపర్ ఓవర్లో బోల్తా పడిన హైదరాబాద్ జట్టు ఈ సారి ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జానీ బెయిర్‌స్టో జతగా కెప్టెన్ డెవిడ్‌ వార్నర్‌ గత సీజన్లో అద్భుత ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. అయితే ఈ సీజన్ లో అంత మెరుగ్గా ఆడట్లేదనే అపవాదు తొలుత ఉన్నప్పటికీ, దాని నుంచి బయట పడ్డారు. మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌లతో మిడిల్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌ విషయానికొస్తే భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు పేస్‌, స్పిన్‌ మెరుపులు మెరిపించనున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ రూపంలో ఓ మ్యాచ్‌ ఫినిషర్‌ అందుబాటులో వచ్చాడు. అయితే, బెంగళూర్, కోల్ కతా, ముంబైతో జరిగిన పోరులో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
మరొక్క సారి..
చెన్నై తో ఆడిన గత మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన రాజస్థాన్ జట్టు మరో విజయం కోసం ఉవ్విళ్ళూరుతున్నది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్ లో వ్యూహాలకు పదును పెడుతున్నాడు. టీమ్ ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి, మంచి ప్రదర్శన ఇచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌లు కీలకంగా మారారు. విధ్వంసక బ్యాట్స్ మెన్ జోశ్‌ బట్లర్‌ లేకపోవడం ఇబ్బందే. పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ నాయకత్వంలో బౌలింగ్‌ విభాగం బాగానే ఉంది. జైదేవ్‌ ఉనద్కత్‌, మయాంక్‌ మార్కండే, శ్రేయాష్‌ గోపాల్‌ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ :
జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, విజయ్ శంకర్‌, విరాట్‌ సింగ్/కేన్ విలియమ్సన్, అబ్దుల్‌ సమద్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ.
రాజస్థాన్‌ రాయల్స్‌ :
రాబిన్‌ ఉతప్ప, యశస్వి జైస్వాల్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, డెవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, శ్రేయాష్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, మయాంక్‌ మార్కండే/ టామ్‌ కరన్‌.
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : సన్ రైజర్స్ హైదరాబాద్
కెప్టెన్: డేవిడ్ వార్నర్
యజమాని: సన్ టీవీ నెట్ వర్క్
విజేత : 2016
రన్నరప్ : 2018
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : రాజస్థాన్‌ రాయల్స్‌
కెప్టెన్: స్టీవ్‌ స్మిత్‌
యజమాని: రాయల్ మల్టీ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : 2008
రన్నరప్ : -






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com