ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లుండి తిరుమలకు వెళ్లనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 05:28 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24 ఉదయం శ్రీవారి దర్శనాంతరం 7గంటలకు ఆలయం వెలుపల వున్న నాదనీరాజన మండపం వద్ద జరగనున్న సుందరకాండ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా పాల్గొంటారు. అనంతరం 8గంటలకు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక 10గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
జగన్ టూర్ షెడ్యూల్..
- 23 సాయంత్రం 3:50 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కి చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గం ద్వారా 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్న జగన్
- సాయంత్రం 6:20 గంటలకు శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
- 24 ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.
కాగా.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ ప్రకటనపై పలు సంఘాలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com