ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 01:04 PM

విజయవాడ : అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు. 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ. అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు . ..శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ ,18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా.19న శ్రీ గాయత్రీ దేవిగా,20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా , 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం...అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం


కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జన. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు .ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com