ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీఎస్ఎన్ఎల్' కొత్తగా తీసుకొచ్చిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 07, 2020, 12:09 PM

BSNL సంస్థ తన వినియోగదారుల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. తన వినియోగదారులు ఇతర నెట్వర్క్లకు మళ్లిపోకుండా ఆ సంస్థ ఎప్పటికప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది.
తాజాగా అందుబాటులో తీసుకురాబడిన రెండు ప్లాన్స్ లో మొట్టమొదటి 1499 రూపాయలు విలువ కలిగిన ప్లాన్. ఇది 365 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకురాబడిన మొదటి 90 రోజుల లోపల గనుక వినియోగదారులు దీన్ని రీఛార్జి చేసుకున్నట్లయితే, అదనంగా మరో 30 రోజులపాటు వ్యాలిడిటీని BSNL సంస్థ అందిస్తోంది. అంటే ఇప్పటి నుండి 90 రోజుల లోపల ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మొత్తం 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 1499 రూపాయల ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు చూస్తే నెలకు 2gb చొప్పున, సంవత్సరం మొత్తానికి కలిపి 24gb మొబైల్ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్ అందించబడతాయి. భారీ మొత్తంలో మొబైల్ డేటా వినియోగం ఉన్నవారికి ఈ ప్లాన్ పెద్దగా ఉపయోగపడదు గానీ, పరిమితంగా మొబైల్ డేటా వాడుతూ, కేవలం వాయిస్ కాల్స్ మీద మాత్రమే ఎక్కువగా ఆధారపడే వారికి కచ్చితంగా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. రోజుకు 250 నిమిషాలు వాయిస్ కాల్స్ పరిమితి విధించబడింది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
రెండో ప్లాన్ 429 రూపాయలు విలువ కలిగి ఉంటుంది. 81 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండే ఈ ప్లాన్ ద్వారా రోజుకి ఒక జీబీ మొబైల్ డేటా అందించబడుతుంది. అది దాటిన తరువాత 40 kbps స్పీడ్ మాత్రమే లభిస్తుంది. దీంతోపాటు అపరిమితమైన వాయిస్ కాల్స్ (రోజుకి 250 నిముషాల పరిమితితో), రోజుకి 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందించబడతాయి.
429 రూపాయలు ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న వారికి Eros Now స్ట్రీమింగ్ సర్వీస్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందించబడుతుంది. రీచార్జ్ చేసుకున్న వెంటనే దానికి సంబంధించిన యూజర్నేమ్ పాస్వర్డ్ లు మీకు పంపించబడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com