ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవ చరిత్రలో ఇంత భారీ పేలుడు కనిపించడం ఇదే తొలిసారి :నాసా

national |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 11:52 AM

అంతరిక్షంలో సుదూరంగా సంభవించిన ఓ పరిణామాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. సూర్యుని కన్నా దాదాపు 20 రెట్ల అధిక పరిమాణంలో ఉన్న ఓ నక్షణం నశించిపోతున్న వేళ, సూపర్ నోవా బ్లాస్ట్ సంభవించగా, హుబుల్ ఈ చిత్రాన్ని బంధించింది. నాసా ఈ బ్లాస్ట్ చిత్రాన్ని విడుదల చేసింది. మానవ చరిత్రలో ఇంత భారీ పేలుడు కనిపించడం ఇదే తొలిసారని, భూమికి 2,400 కాంతి సంవ్సరాల దూరంలో ఇది జరిగిందని నాసా వెల్లడించింది.


సూపర్ నోవాలను గమనించేందుకు వివిధ రకాల హై ఎండ్ టెలిస్కోప్ లను వినియోగిస్తున్నామని, వాటిల్లో ఒకటి ఈ దృశ్యాన్ని చిత్రీకరించిందని నాసా సైంటిస్టులు వివరించారు. అంతరిక్షం, సూపర్ నోవాలపై అధ్యయనంలో ఈ చిత్రం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఇక ఈ సూపర్ నోవా బ్లాస్ట్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్న నాసా, ఈ పేలుడు తరువాత కాంతిపుంజాలు ఎంతో దూరం ప్రసరించాయని పేర్కొంది. ఆకాశాన్నంతా కప్పేసేలా విస్తరించిందని వెల్లడించింది. ఇ ఇమేజ్, ఇమాజినేషన్ పవర్ ను చెప్పకనే చెబుతోందని వెల్లడిస్తూ, మీకు నచ్చిందా? అని ప్రశ్నించింది.


ఈ పేలుడు 10 వేల నుంచి 20 ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చని, దీని కాంతి 60 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించింది. సెకనుకు 220 మైళ్ల వేగంతో సూపర్ నోవా విస్తరించిందని నాసా పేర్కొంది. కాగా, ఇటీవల పాలపుంతకు అత్యంత సమీపంలోని ఆండ్రోమెడా గెలాక్సీలో భారీ ఎత్తున వాయు ప్రవాహాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com