సిరియాలోని అరబ్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావం సుదూర ప్రాంతం వరకు ఉండగా, అంతటా అంధకారం నెలకొంది. పేలుడు విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి ధ్రువీకరించారు. సిరియాలోని యాడ్ డుమాయిర్, ఆద్రా ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించినట్లు విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. ఉగ్రవాద చర్యగా మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అరబ్ గ్యాస్ పైప్‌లైన్ (ఏజీపీ) ఈజిప్ట్ నుంచి జోర్డాన్, సిరియా, లెబనాన్‌కు సహజ వాయువును తరలించేందుకు నిర్మించిన ట్రాన్స్ రీజినల్ గ్యాస్ ఎగుమతి గ్యాస్‌పైప్‌లైన్. దీని పొడవు 1200 కిలో మీటర్లు ఉండగా, సుమారు 1.2 బిలియన్ల వ్యయంతో నిర్మించారు.