రైమాండ్ హ్యారింగ్టన్ అనే వ్యక్తి ఇటీవల వర్జీనియా బీచ్‌లోని వేగ్నం స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ తన లక్ పరీక్షించుకోడానికి 25 డాలర్లు చెల్లించి 25 లాటరీ టికెట్లు (ఒక్కక్కటీ ఒక డాలర్) కొనుగోలు చేశాడు. అందులో ఒకటి తగిలినా చాలు.. కొన్న టికెట్లకు లాభం వచ్చినట్లే అనుకున్నాడు. అయితే, ఒక్కో లాటరీ టికెట్ బహుమతి విలువ 5 వేల డాటర్లు (రూ.3.74 లక్షలు). అలా 25 లాటరీ టికెట్లకు కలిపి సుమారు రూ.93 లక్షలు గెలుచుకున్నాడు. మొదటి 25 మంది విజేతల వివరాలను ప్రకటించేందుకు నిర్వహించిన డ్రాలో.. రైమాండ్ కోనుగోలు చేసిన లాటరీ టికెట్లే రావడం గమనార్హం.