ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆఫర్ల జోరు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 06, 2020, 05:35 PM

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రైమ్‌ డే-2020 సేల్ పేరిట అమెజాన్ తన వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్లు, టీవీలతో పాటు అనేక ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌ సభ్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక రాయితీలు రేపు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, హోమ్‌ అప్లయన్సెస్‌పై 60 శాతం వరకు తగ్గింపు ధరలను అమెజాన్‌ ప్రకటించింది. బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన ఆఫర్లు ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఫ్యాషన్‌ దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటిపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com