ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 గంటలు కదలకుండా వీడియో రికార్డ్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 06:49 PM

ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించి చివరకు ఏమీ చెయ్యకుండా ఓ చోట కదలకుండా కూర్చున్నాడు. 2 గంటలపాటూ అలాగే కూర్చొని కెమెరావైపే చూశాడు. దాన్నే వీడియోగా అప్‌లోడ్ చేశాడు. దానికి టైటిల్ 2 JAM nggak ngapa ngapain అని పెట్టాడు. దానర్థం 2 గంటల పాటూ కదల్లేదు అని. ఇండోనేసియా యూట్యూబర్ మహమ్మద్ దిదిత్ ఆలోచన ఇది. చాలా మంది అతన్ని యూత్‌ని ఎడ్యుకేట్ చేసే వీడియోలు అప్‌లోడ్ చెయ్యమని కోరారట. దాంతో ఈ వీడియో పెట్టానని చెబుతున్నాడు. యూత్ ఎడ్యుకేషన్‌కీ ఈ వీడియోకీ ఏమైనా సంబంధం ఉందా అంటే ఒక్క శాతం కూడా లేదు. కానీ దిదిత్ ఏమంటున్నాడంటే ఇప్పుడు తన వీడియో వైరల్ అవుతోందనీ, యూత్‌కి తాను ఇచ్చే సందేశం ఇదే అంటున్నాడు.జులై 10న దీన్ని అప్‌లోడ్ చెయ్యగా ఇప్పటికే 19 లక్షల మందికి పైగా దీన్ని చూశారు. ఏమీ చెయ్యకుండానే ఈ వీడియోకు దాదాపు రూ.70వేల దాకా రెవెన్యూ పొందినట్లైంది. యూత్ కొత్తగా ఆలోచించాలన్నదే ఇందులో సందేశం కావచ్చంటున్నారు. ఈ వీడియోలో అతను ధ్యానం చేస్తున్నాడని కొందరు అంటుంటే అసలీ ఆలోచన ఎలా వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఏమీ చెయ్యని అతని గురించి 15 లక్షల మంది తెలుసుకున్నారని ఇంకో యూజర్ తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com