ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(02-08-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 09:19 AM

రాశి- మేషం


కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది.


రాశి- వృషభం


ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు.


రాశి- మిధునం


కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి.


రాశి- కర్కాటకం


వ్యాపారాలలో నిదానం పాటించండి. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు.


రాశి- సింహం


ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్‌ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. కష్టానికి ఫలితం కనిపించదు.


రాశి- కన్య


బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తా రు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.


రాశి- తుల


స్థిరాస్తి వివాదాలు నెలకొని సహనాన్ని పరీక్షిస్తాయి. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు.


రాశి- వృశ్చికం


నిరుద్యోగులకు మరింత శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి.


రాశి- ధనస్సు


కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు.


రాశి- మకరం


ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. అపోహాలు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.


రాశి- కుంభం


కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో గెలుపొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రుణ ఒత్తిడులు కాస్త తొలగుతాయి.


రాశి- మీనం


ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.


రాశి- ధనస్సు


కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు.


రాశి- మకరం


ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. అపోహాలు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.


రాశి- కుంభం


కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో గెలుపొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రుణఒత్తిడులు కాస్త తొలగుతాయి.


రాశి- మీనం


ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com