ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(05-07-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 09:36 AM

రాశి- మేషం


బీమా, గ్రాట్యుటీ, పెన్షన్‌ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ల వారికి పురోభివృద్ధి. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.


రాశి-వృషభం


స్త్రీలకు సంపాదనపై ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు.


రాశి-మిధునం


విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు. రాబడి తగ్గి రుణాలు చేయాల్సివస్తుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు కొన్ని అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు కొంత నిరుత్సాహమే.


రాశి-కర్కాటకం


ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత ముఖ్యం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. శారీరక రుగ్మతలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.


రాశి-సింహం


ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు మరింత అనుకూలత సాధిస్తారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.


రాశి-కన్య


పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థలాలు, గృహం కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు.


రాశి-తుల


ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు తప్పవు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు. వ్యాపారాలు ఆశనిరాశ మధ్య కొనసాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.


రాశి-వృశ్చికం


పిల్లల విషయంలో శుభ పరిణామాలున్నాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. దూర ప్రయాణాలు ఉంటాయి.కష్టపడ్డా ఫలితం సాధించలేరు. ఆస్తి వివాదాలు గందరగోళం పెడతాయి. రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త వివాదాలు.వ్యాపారాలు నిరాశపరుస్తాయి.ఉద్యోగులకు అనుకోని బదిలీలు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి.


రాశి-ధనస్సు


సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. స్నేహితులతో వివాదాలు తీరతాయి. రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు పరిశోధనల్లో విజయం సాధిస్తారు.


రాశి-మకరం


చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాలు ఉండవచ్చు. సన్నిహితులతో విభేదాలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంతగా అనుకూలం కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.


రాశి-కుంభం


విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారడం విశేషం. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. ఐటీ నిపుణులు మరింత ప్రగతి సాధిస్తారు.


రాశి-మీనం


కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. బంధువర్గం నుంచి విమర్శలు ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తలనొప్పిగా మారతాయి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com