నిరుద్యోగులకు శుభవార్త. తాత్కాలిక పద్దతిలో భారత్ లో 50,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని అమెజాన్ నిర్ణయించింది. లాక్ డౌన్ ముగిసిన మార్కెట్లకు వెళ్లేందుకు చాలామంది భయపడి, ఆన్ లైన్ ప్లాట్ ఫాంల ద్వారా కొనుగోళ్ళకు ఆసక్తి చూపుతారని అమెజాన్ ఇండియా విభాగం అంచనా వేస్తోంది. అందుకోసం డెలివరీ విభాగంలో పెద్దఎత్తున నియామకాలు చేపట్టాలని భావిస్తోంది.