ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ పోరులో అద్భుతం జరిగింది. ఎవ్వరూ వూహించని విధంగా కొత్త చాంపియన్ అవతరించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ప్రపంచ 47వ సీడ్ లత్వియా దేశానికి చెందిన జెలెనా ఒస్టాపెంకో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో రుమేనియాకు చెందిన ప్రపంచ నెంబర్-3 క్రీడాకారిణి సిమోనా హలెప్‌పై 4-6, 6-4, 6-3 తేడాతో గెలుపొందిన ఒస్టాపెంకో టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత రెండు రోజుల క్రితమే 20వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఒస్టాపెంకో వారి దేశం నుంచి 34 ఏళ్ల తరువాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టిన రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాకుండా తన కెరీలో కూడా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇప్పటివరకూ ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ రెండో రౌండ్ దాటని ఒస్టాపెంకో ఏకంగా 34ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు చేరిన తొలి ప్రయత్నంలోనే టైటిల్‌ను ముద్దాడి విశ్లేషకులందరినీ విస్మయానికి గురి చేసింది. తొలిసారి వైల్డ కార్డు క్రీడాకారిణిగా గుర్తింపు పొందడమే కాకుం డా, లాత్వియా తరఫున గ్రాండ్‌స్లామ్ దక్కించు కున్న తొలి క్రీడాకారణిగా ఒస్టాపెంకో రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఒస్టాపెంకో... తాను సాధించిన విజయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొంది. తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపింది.