తన కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్ ఈ మధ్య అంతగా అలరించలేకపోతున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాలని భావిస్తున్నప్పటికి ఈ హీరో సినిమాలు అంతగా జనాదరణ పొందడం లేదు. తాజాగా ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండగా , మొన్న చిత్ర ప్రీ లుక్ విడుదల చేశారు. ఇక ఈ రోజు నరేష్ తండ్రి ఈవివి సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.