విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.అమరావతికి నేను వ్యతిరేకం కాదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై టీడీపీ అధిష్టానం వైఖరిపై రమేష్ బాబు అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా బాబుకు సలహాలు ఇస్తున్నారు అని పంచకర్ల అన్నారు. విశాఖ రాజధానికి టీడీపీ ఎందుకు వ్యతిరేకం ? అని ప్రశ్నించారు.