కొన్నాళ్లుగా తన విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది నటీమణి నిత్యామీనన్. నటిగా సత్తా చాటుతున్న ఈ భామ దర్శకత్వం మీద కన్నేసిందని.. డైరెక్టర్ గా మారాలని అనుకుంటోందని... అందుకోసం ఏకంగా హీరోయిన్ ఛాన్సులను కూడా కాదనుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. నటిగా మంచి డిమాండ్ ఉన్నా, దాన్ని లెక్క చేయకుండా అవకాశాలను వదులుకుంటోందనే మాట వినిపిస్తోంది.
అందుకు తగ్గట్టుగా నిత్యా మీనన్ సినిమాలకు కొంత విరామం కూడా వచ్చింది. దీంతో నిత్య డైరెక్షన్ డ్రీమ్స్ నిజమే అయ్యుండొచ్చని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై స్పందించిందామె. నిత్య చెప్పేదేమిటంటే.. తనకు అస్సలు దర్శకత్వం మీద ఆసక్తే లేదనేది. తను డైరెక్టర్ కావాలి అనుకోవడం లేదు అని.. నిత్య స్పష్టం చేసింది.
ప్రస్తుతం తను పూర్తిగా నటన మీదే కాన్సన్ ట్రేట్ చేశానని చెప్పింది. డైరెక్టర్ అయిపోవాలనే డ్రీమ్ తో హీరోయిన్ ఛాన్సులను వదులుకోవడం అబద్ధం అని.. ప్రస్తుతం వివిధ సినిమాలతో బిజీగా ఉన్నట్టుగా నిత్య చెప్పింది. మొత్తానికి తన డైరెక్షన్ డ్రీమ్స్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆపడానికి నిత్య ప్రయత్నాలు ఆరంభించినట్టుంది.