ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన రికార్డు తానే బద్దలు కొట్టిన నిర్మలా సీతారామన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2020, 07:15 PM

కేంద్ర ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2వ సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. లోక్ సభ చరిత్రలోనే నిర్మలా సీతారామన్ ప్రసంగం సుదీర్ఘ కాలం సాగిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచిపోయింది. నిర్మలా సీతారాామన్ తన ప్రసంగాన్ని 2 గంటల 42 నిమిషాలు కొనసాగించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రసంగం మధ్యాహ్నాం 1 గంటల 42 నిమిషాల వరకు సాగింది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులలో ఇంత ఎక్కువ సమయం బడ్జెట్ చదివిన వ్యక్తి నిర్మలా సీతారామనే. 2019-2020 లో నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించింది. ప్రస్తుతం 2గంటల 42 నిమిషాలు మాట్లాడి తన రికార్డును తానే బద్దలు కొట్టింది.
2003-04 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పించిన అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ 2 గంటల 13 నిమిషాలపాటు ప్రసంగించి తర్వాతి స్థానంలో ఉన్నారు. అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పిస్తూ.. 2 గంటల 10 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆయన మూడవ స్థానంలో నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com