ఆధార్‌కార్డుతో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఆధార్‌కార్డు కూడా లైసెన్సు జారీలో పొందుపరుస్తున్నప్పటికీ తప్పనిసరి చేయలేదు. భవిష్యత్తులో దీనిని తప్పపనిసరి చేస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తప్పనిసరి చేసి ఈ నిర్ణయాన్ని రద్దు చేసినా ప్రస్తుతం మళ్లీ దాని నే అమలు చేయాలని భావిస్తున్నారు.
డ్రైవిం గ్ లైసెన్సుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడం వల్ల సంబంధిత లైసెన్సుదారుడి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని ఈ నిర్ణ యం తీసుకుంటున్నారు. ఆధార్‌కార్డు జోడించడం వల్ల యాక్సిడెంట్స్‌తో పాటు కేసుల విచారణ సులభతరమై బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. దాదాపు బ్యాంకులు, ఇతర లావాదేవీలతోపాటు ప్రతి దానికి, ధ్రువ పత్రాలను జతపరుస్తుండటంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కూడా తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది.