(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆరోగ్య రక్ష పథకం నీరుగారుతోంది. లబ్ధిదారు లకు ప్రైవేటు వైద్యం అందని ద్రాక్షలా మారింది. వివిధ జిల్లాల్లోని ప్రధాన ప్రైవేటు ఆసుప్త్రుల్లో ఆరోగ్య రక్ష అమలు కావడం లేదు. ఆరోగ్య రక్ష కార్డుతో ప్రైవేటు ఆసుప్త్రులకు వెళితే వెనక్కి పంపిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమ లులోకి వచ్చిన ఈ పథకం ద్వారా రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 280 మంది రోగులకు మ్త్రామే వైద్యం అం దింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో పరిస్థితి ఆధ్వానంగా ఉంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలున్న ప్రైవేటు ఆసుప్త్రులు ఆరో గ్య రక్ష కార్డుదారులకు వైద్యం అందించేందుకు అంగీక రించడం లేదు. ఫలితంగా ఆరోగ్య రక్ష కార్డు ఉన్నప్పటికి సొంత డబ్బుతో వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తు తోంది. రాష్ర్టవ్యాప్తంగా ఆరోగ్య రక్ష పథకంలో ఇప్పటి వరకూ అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 40 మంది వైద్యం పొందారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాల్లో 4397 కుటుంబాలు ఆరోగ్య రక్ష పథకంలో పేర్లు నమోదు చేసుకున్నాయి. విశాఖపట్నంలో పరిస్థితి మరీ దారు ణంగా ఉంది. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆసు ప్త్రులు 40 ఉన్నా ఆరోగ్య రక్ష పథకం కింద కేవలం నలుగు రికే చికిత్స లభించింది. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆరోగ్య రక్ష పథకం నెల్లూరు, కర్నూలు, శ్రీకా కుళం ప్రాంతాలు మినహా పూర్తిస్థాయిలో ఏ జిల్లాలోనూ అమలుకావడం లేదు. మరోవైపు రోగులు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి అత్యధిక ఫిర్యా దులు అందుతున్నాయి.
యాజమాన్యాల మొండి వైఖరి
ఆరోగ్యరక్ష పథకాన్ని అమలు చేయాలంటే తమకు ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా జీవో జారీ చేయాలనే మొండి పట్టు దలతో ప్రైవేటు ఆసుప్త్రుల యాజమాన్యం ఉన్నట్లు సమాచా రం. వైద్యం కోసం వచ్చిన వారికీ ఇదే విషయాన్ని చెబుతు న్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఆశా ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివిధ అంశాలపై వారికి హామీ ఇచ్చారు. దీనిపై ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఆసుప్త్రులకు అంద లేదు. గతంలోనూ ఇలాంటి హామీలు అనేకం ఇచ్చిన ప్రభుత్వం చాలా వాటిని గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో మంత్రి హామీలపై స్పష్టమైన ఉత్తర్వులు వెలువడితేనే ఆరోగ్యరక్ష అమలు చేయాలనే ధోరణిలో ప్రైవేటు ఆసు ప్త్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. వారిపై కఠిన వైఖరి అవలంబించడంలో ఎన్టీఆర్ వైద్య సేవ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి నేరుగా పర్యవేక్షిస్తుండటం వల్ల జోక్యంచేసుకుంటే ఇబ్బందులు వస్తాయని భావించడంతో ఈ పరిస్థితి నెలకొంది.