ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పవన్‌తో టీడీపీ నేతల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 10:27 AM

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఇవాళ టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు టీడీపీ నేతలు జనసేనాని పవన్‌తో సమావేశం కానున్నారు. రేపటి చంద్రబాబు దీక్షకు మద్దతివ్వాలని టీడీపీ నేతలు పవన్‌ను కోరనున్నారు. ఇసుక సమస్యపై రేపు విజయవాడలో చంద్రబాబు ఒక రోజు దీక్ష నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాదు దీక్ష చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com