నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో చిన్నచిన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో వున్న రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. రహదారులపై వర్షపునీరు చేరింది. జనజీవనం స్థంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.