జమ్ము : భారత జవాన్లు 12 ఏళ్ల పాకిస్థాన్ బాలుడిని అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రే్ఖ దాటి భారత భూభాగంలోనికి ప్రవేశించిన 12 ఏళ్ల బాలుడిని ఈ రోజు అరెస్టు చేసినట్లు ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. ఈ బాలుడిని పాకిస్థాన్ ఆర్మీయే సరిహద్దులు దాటించి ఉంటుందని భారత జవాన్లు బలంగా నమ్ముతున్నారు. ఉగ్రవాదుల చొరబాట్లకు ఉన్న అవకాశాలు గమనించి రమ్మని పంపి ఉంటుందని భావిస్తన్నారు.