ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలయాళ భామకు లక్కీడ్రాలో 500 గ్రాముల బంగారం…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 05, 2017, 01:34 PM

కొందరికి టాలెంట్‌ ఉన్నా అదృష్టం ఉండదు, కొందరు టాలెంట్‌ లేకున్నా అదృష్టంతో సాగిపోతుంటారు. అయితే మలయాళ హీరోయిన్‌ ఐమారోస్నీ సెబాస్టియన్‌కు మాత్రం ఇవి రెండూ బాగా ఉన్నాయి. గతేడాది ‘జకాబ్నేట్ స్వర్గరాజ్యం’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమెకు ఇప్పుడు లక్కీ డ్రాలో ఒకటి, రెండు తులాలు కాదు అరకిలో బంగారం దొరికింది.


రీసెంట్‌గా అక్షయ తృతీయ సందర్భంగా దుబాయ్‌లోని ఓ గోల్డ్‌ షాప్‌లో లక్కీ డ్రాలో ఈమె పేరును విజేతగా ప్రకటించారు. ఈ డ్రాలో ఏకంగా అరకిలో బంగారాన్ని ఆమె గెలుచుకుంది. దీంతో తబ్బుబ్బిపోయిన ఆమె ఇంత అదృష్టం తనను వరిస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com