తెదేపానేత చింతమనేనికి ఒక న్యాయం, మీకు అస్మదీయుడైన శ్రీధర్ రెడ్డికి మరో న్యాయమా? అని తెదేపా వర్ల రామయ్య ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ మహిళా ఎంపీడీవో సరళపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం పై సిఎం జగన్ ఎందుకు స్పందించరని నిలదీసారు తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో గగ్గోలు పెట్టిన సంఘాలు ఇప్పుడు, . మహిళా అధికారిణిని వైకాపా ఎమ్మెల్యే హింసిస్తుంటే… రాష్ట్ర అధికారులు, ఎంపీడీవో సంఘాలు ఏమి చేస్తున్నాయని . శ్రీధర్ రెడ్డికి భయపడ్డాయా? అని ప్రశ్నించారు. సరళను మానసిక క్షోభకు గురి చేసిన ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.‘ ముఖ్యమంత్రి గారూ శ్రీధర్ రెడ్డి దౌర్జన్యాలు తమరి దృష్టికి ఎందుకు రావడం లేదు. మీ సమాచార వ్యవస్థ అంత బలహీనంగా ఉందనిపిస్తోందని ఎద్దేవా చేసారు.