అబద్ధమా.. అబద్ధమా నువ్వు ఎందుకు నవ్వుతున్నావంటే.. చంద్రబాబును చూసి నవ్వుతున్నానని చెప్పిందంట’ చంద్రబాబును చూసి అబద్ధం కూడా నవ్వే పరిస్థితి వచ్చిందన్నారుచిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ ఏపీలో అక్టోబర్ 2న మద్యం దుకాణాలు ఓపెన్ చేశారని… మద్యం పోలీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందు అమ్ముతున్నారని మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు లేనిది ఉన్నట్లుగా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని, గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మిందని చెపుతున్న బాబుకు, ఎక్కడ అమ్మకాలు జరిగాయో వచ్చి చూపట్టే దమ్ముందా అని సవాలు విసిరారు.