ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్రంలోని పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థికపరమైన ప్యాకేజీల రూపంలో లబ్ధి కలిగిస్తున్నందున ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నది. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పిపిపి), చిన్న తరహా పరిశ్రలు మొదలైన వాటిలో స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విధంగా పథకాలను రూపొందిస్తున్నది. ఇతర రాష్ట్రాలు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర యువత కోసం తామెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా అన్నారు.