ఇవాళ 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్రమోదీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ తెలిపారు. నరేంద్రమోదీజీకి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.