ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొడాలి కారులో చింతమనేని ... పోలీసులు ఛేజ్ చేసి ఆపితే ,,,

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 01:11 AM


తమదైన శైలిలో  తన కోసం వేట సాగిస్తున్న పోలీసులకు చింతమనేని నిజంగానే చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పరారీలో ఉన్న చింతమనేని ఓ కారులో వెళుతున్నారని – సదరు కారు వివరాలను పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు అందజేయటంతో  హడావిడి చేసిన పోలీసులు ఛేజింగ్ చేసి మరీ ఆ  వాహనాన్ని పట్టేసుకున్నారు. 

తీరా కారులో చూశాక…అందులో చింతమనేని లేరని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురి కాగా… ఆ వెంటనే వారికి మరో షాక్ తగిలింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పట్టేసుకున్న కారుపై గుడివాడ ఎమ్మెల్యే – జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కొడాలి నాని పేరు ఉందట. అయినా కొడాలి నాని స్టిక్కర్ ఉన్న కారులో చింతమనేని ఎలా ఉంటాడని కనీసం పోలీసులు ఆలోచించక , సమాచారమందిందని సినీ ఛేజింగులు చేశారు. తేరా చుస్తే తలా బొప్పికట్టింది. 
నిజానికి కేసు నమోదైన మరునాడు మీడియాతో మాట్లాడిన చింతమనేని… ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారనతమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి  నిత్యం మీడియాలో ఉండే చింతమనేని ఏంటి? పరారీలో ఉండటమేంటి? అన్న   చర్చలు సాగుతున్నాయి. ఆయన నిక్షేపంగా తన ఇంటిలోనే ఉన్నారని పోలీసులే ఆయనను అరెస్ట్ చేసేందుకు ధైర్యం చాలడం లేదన్న వాదన మరొకటి వినిపిస్తోంది.  మరో వైపు  కేసులో బెయిల్ వచ్చేదాకా చింతమనేని పోలీసులకు చిక్కరన్న కోణంలో ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. 
  
   







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com