ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఈ లావాదేవీలకు ఏటీఎం లలో ఛార్జీలు లేవు

national |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 05:19 PM

ఏ బ్యాంకు ఖాతాదారులైన సరే పరిమితి ఏటీఎం లావాదేవీలు ఉండేవి. కొన్ని కొన్ని సార్లు ఏటీఎం లో డబ్బులు లేకపోయినా, బాలన్స్ చెక్ చేసుకున్న, ఏటీఎం మిషన్ లో సమస్యలతో లావాదేవీ నిలిచిపోయిన ఓ లావాదేవీ రుసుము వర్తించేది. అయితే ఇలాంటి కొన్ని లావాదేవీలకు ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులు సహా అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి.


ఆ లావాదేవీలు ఏమిటంటే..


హార్డ్‌వేర్‌ వైఫల్యం: వినియోగదారుడు ఏటీఎంను ఉపయోగిస్తున్నప్పుడు యంత్రంలోని హార్డ్‌వేర్‌ విఫలమైలావాదేవీ నిలిచిపోతే.. దాన్ని లావాదేవీగా పరిగణించరాదు.


సాఫ్ట్‌వేర్‌ వైఫల్యం: ఏటీఎం సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా సమస్య తలెత్తి లావాదేవీ విఫలమైతే.. దానికి ఎలాంటి చార్జీ విధించరాదు.


సమాచార వైఫల్యం: కొన్నిసార్లు సమాచార వైఫల్యం కారణంగా లావాదేవీ నిలిచిపోతుంది. వాటిని కూడా లావాదేవీగా పరిగణించరాదు.


ఏటీఎంలో నోట్ల లేకపోవడం: వినియోగదారుడు కోరిన మేరకు ఏటీఎం కరెన్సీ నోట్లను అందించకపోతే.. లావాదేవీ వైఫల్యంగా పరిగణించాల్సిందే. దానికి ఎటువంటి చార్జీని విధించరాదు.


తప్పు ఏటీఎం పిన్‌: వినియోగదారుడు ఏటీఎం పిన్‌ను తప్పుగా ఇస్తే.. దాన్ని కూడా లావాదేవీగా పరిగణించరాదు.


కార్డు యాక్టివేషన్‌: డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను యాక్టివేట్‌ చేసేందుకు ఒక్కోసారి ఏటీఎంల ద్వారా తొలి లావాదేవీ జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి చార్జీని విధించరాదు.


బ్యాలెన్స్‌: ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉందో పరిశీలించుకోవడానికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు. ఆ సేవలను ఖాతాదారులకు పూర్తిగా ఉచితంగా అందించాలి.


చెక్‌ బుక్‌ విజ్ఞప్తి: ఏటీఎం ద్వారా కొత్త చెక్‌ బుక్‌ కోసం ఖాతాదారుడు చేసే విజ్ఞప్తిని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.


పన్నుల చెల్లింపులు: ఏటీఎం ద్వారా ఖాతాదారుడు తన పన్నులను చెల్లిస్తే.. ఆ లావాదేవీని ఉచితంగానే పరిగణించాలి.


నిధుల బదిలీ: ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని వేరే అకౌంట్‌లోకి పంపించేందుకు వినియోగదారుడు ఏటీఎంను వినియోగిస్తే.. దాన్ని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com