ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిటిల్ మోడల్ ఎర్త్ 2019 పేరిట అంతర్జాతీయ బాలోత్స వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 06:30 PM

ఆలోచనలు అందరికి వస్తాయి. కొన్ని సాదాసీదాగా అనిపిస్తే, కొన్నింటిలో అనూహ్యమైన ఆంతర్యం దాగి వుంటుంది. చిగురంత బీజంలో మహా వృక్షము వున్నట్టు ఒకో ఆలోచనలో అద్భుతాలు ఆవిష్కారం కావచ్చు. ఎంచుకున్న రంగం, చేపట్టిన కార్యం ఏదైనా కొత్తదనం వెల్లివిరియాలని, సృజనాత్మకత ప్రగతికి ప్రేరణ కావాలని కొంత మంది మూస ధోరణికి భిన్నంగా ఆలోచిస్తారు. ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేసే ఆవిష్కరణల కోసం కలలు కంటారు. వాటిని సాకారం చేసుకోవడానికి కొత్త బాటలు పరుచుకుంటారు. తమలోని ప్రతిభా నైపుణ్యాలను, సృజనాత్మక శైలి మదుపుగా చేసుకుని ముందుకు సాగుతారు. సవాళ్ళను, సంఘర్షణలను ఢీ కొంటారు. సంక్షోభాలకు చలించరు. అడ్డంకుల్ని సైతం అవకాశాలుగా మలుచుకుంటారు. తాము ఎంచుకున్న రంగం మీద తమదైన ముద్ర వేస్తారు. నవ్య చైతన్య స్ఫూర్తిగా నిలిచే కొద్దిపాటి మహిళామణులలో వాలంటీనా మిశ్రా ఒకరు.. అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని, ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించి, విజయాలు సాధించే దిశగా బాలబాలికలను సన్నద్ధం చేయడం కోసం వాలంటీనా మిశ్రా “ డి లా వాలంటీనా ” అనే సంస్థను స్థాపించారు. వాలంటీనా ఒక అంతర్జాతీయ ప్రొఫెషనల్ మోడల్.. ఆమె మోడల్స్ ని తీర్చి దిద్దే ఓ అంతర్జాతీయ ఏజెన్సీని నిర్వహిస్తూ, మన చిన్నారులలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీసి వారి ప్రతిభా వ్యుత్పత్తులను భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం కోసం లిటిల్ మోడల్ ఎర్త్ 2019 పేరిట అంతర్జాతీయ బాలోత్సను నిర్వహించడం ప్రశంసనీయమని బాలీవుడ్ హీరోయిన్,మోడల్ రిడ్జ్ మన్ చందా ఆదివారంనాడు హోటల్ మేఘాలయాలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. విశ్వ సోదరభావనను పరివ్యాప్తం చేయడమే తన లక్ష్యమని త్వరలో జరగబోయే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు పాల్గొంటున్నాయని వాలంటీనా మిశ్రా తెలియజేసారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే “ లిటిల్ మోడల్ ఎర్త్ 2019 ” అద్భుత ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కాబోతోందని, ఈ ప్రదర్శనతో విశాఖ నగరం పర్యాటక ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. నిజానికి ప్రకృతి కాంత దాల్చిన సుందరరూపం విశాఖ. హొయలు, లయలు తనలో నింపుకొని సౌందర్య ఆరాధకులను అలరిస్తున్న అందాల బరిణి. అడుగడుగునా అందాలే.. సహజ సౌందర్య సోయగాలే ఎత్తైన కొండలు, లోయలు, సాగరతీరాలు, నందన వనాలు విశాఖకే సొంతం అన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ లో నవ్యాధునిక పర్యాటక కేంద్రం విశాఖ. సందర్శకుల పాలిట అద్భుతం. నగరంలో జరిగే అత్యాధునిక ఫ్యాషన్ షోలు, ఈవెంట్స్ అన్నీ విశాఖ నగర ప్రజల మనసులను రంజింపచేసేవే. వారి ప్రశంసలు అందుకున్నవే. అంతటి గొప్ప నగరంలో తాము సంకల్పించిన “ లిటిల్ మోడల్ ఎర్త్ 2019” కి హోస్ట్ కావడం నిజంగా గొప్ప విషయమని ” వాలంటీనా మిశ్రా ” అన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో అపార అనుభవం గడించి 25 సంవత్సరాలు పైగా భాగస్వామిగా వుంటూ ఎన్నో అందాల ప్రదర్శనలకు, అందాల పోటీలకు మార్గదర్శిగా నిలుస్తున్న, దక్షిణ ఆఫ్రికాకి చెందిన అమందా క్రియిల్చే వ్యవస్థాపితమైన, దక్షిణ ఆఫ్రికాలోని ఎమోన్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా విశాఖలో ఈ లిటిల్ మోడల్ ఎర్త్ 2019 ‘ ప్రదర్శన జరుగుతుందని, ఈ ఎమోన్ ఏజెన్సీలో గడ జోహాన్స్బర్గ్, కేప్ టౌన్, ప్రిటేరియాలో ఈ తరహా ప్రదర్శనలకు హోస్ట్ గా వ్యవహారించిందని, విశాఖలో జరగబోయేది నాల్గవ ప్రదర్శన అని వాలంటీనా మిశ్రా వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో టూరిజంకి టేబుల్ మౌంటింగ్, న్యాయ నిర్ణేతల సంఘంతో భేటీ, వ్యక్తిగత ప్రతిభమదింపు ఆవృత్తి, దేశం పట్టిక ప్రదర్శన, జాతీయ వస్త్రధారణ ఆవృత్తి, ఉత్కంఠభరితమైన పతాక సన్నివేశం, విజేతలకు కిరీటధారణ వంటి వివిధ దశల్లో పోటీదారులు పాల్గొనవలసి వుంటుందని పేర్కొన్నారు. 4 నుంచి 18 సంవత్సరాల మధ్య వయోవర్గాలకు చెందిన బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొనవచ్చని ఈ వయోవర్గాలను 4-7 సం. మినీ, 8-11 లిటిల్, 12-15 ప్రీటీన్, 16-17 టీన్గా వర్గీకరించారని వాలంటీనా మిశ్రా తెలియజేసారు. పిల్లలలోని అంతర్గత సృజనను, ప్రతిభను వెలికితీసి, వాళ్ళ నైపుణ్యాలకు పదును పెట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖ మెట్రో నగరాలలోని చిన్నారులలో 4 నుంచి 18 సంవ.. బాలబాలికలకు అందాల పోటీ నిర్వహిస్తున్నామని, భారతదేశ వ్యాప్తంగా చెన్నయ్, ఢిల్లీ, ఒడిశా, ముంబాయి, విశాఖపట్నంలలో ఆడిషన్లు నిర్వహించమని, మోడల్ టాలెంట్ అంతర్జాతీయ పోటీలలో భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు తమ ఏజెన్సీ అవసరమైన శిక్షణ ఇచ్చి వాళ్ళను పోటీలకు సన్నద్ధం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో ప్రచార, మార్కెటింగ్ రంగాలలో తన ఉనికిని నిలుపుకొని, వివిధ రంగాలలో తన అంకుర సంస్థల స్థాపనతో తనదైన ముద్రతో బహుముఖంగా విస్తరిస్తున్న ప్రముఖ రీసెర్చ్ మీడియా గ్రూప్ కి తమ సంస్థకి మధ్య ఓ పరస్పర సహకార ఒప్పందం కుదరడం తమకు ఎంతో సంతోషంగా ఉందని వాలంటీనా మిశ్రా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాకలపాటి విజయ్ వర్మ మాట్లాడుతూ “ డి లా వాలంటీనా ఏజెన్సీ ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీలు, ప్రదర్శనలకు ఆసక్తి, చొరవ గల యువతీ యువకులకు తర్ఫీదు ఇచ్చి, వాళ్ళను విశ్వ వేదికలపై నిలపడంలో దాదాపు 20 ఏళ్లగా విశేషకృషి చేస్తోందని ఆ సంస్థ నిర్వహకులు వాలంటీనా మిశ్రా ఓ అంతర్జాతీయ ప్రొఫెషనల్ మోడల్, ఎందరో మోడల్ విజేతలను తయారు చేసిన ఓ గొప్ప శిక్షకురాలని ప్రశంసించారు.
రాబోయే డిసెంబర్ మొదటి వారంలో 1 నుండి 7 తారీఖు వరకు విశాఖపట్నంలోని వెల్కమ్ హోటల్ గ్రాండ్ బే లో “లిటిల్ మోడల్ ఎర్త్ 2019 ‘ శీర్షికతో అద్భుతమైన ప్రపంచ అందాల పోటీని నిర్వహించడం అభినందించదగ్గ విషయం. మా గ్రూప్ కు ఈమోడల్ సంస్థకు పరస్పర సహకారం అంశాలపై ఒక ఒప్పందం కుదిరందని ఈ సంస్థ సేవలు సలహాలు సూచనలు, సహకారంతో మా రీసెర్చ్ మీడియా గ్రూప్ కు చెందిన సెలిబ్రిటీ హబ్, వరల్డ్ ఫ్యాషన్ మానియా ప్రగతికి ఎంతో దోహదం చేస్తాయి అని అన్నారు.
ఎదిగే వయస్సులో చిన్నారులలో ఆత్మవిశ్వాసం నెలకొల్పడం వారు స్థిరమైన అడుగులతో భవిత వైపు నడిచేలా చూడడం ఒక ఎత్తైతే, వారిలో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడం, వాటిని సాన పట్టడం మరో ఎత్తు. చిన్నారుల మూర్తిమత్వం, ప్రతిభాన్వేషణ పోటీలకు దేశంలో ప్రధాన నగరాలలో ఎంపిక చేసిన బాలబాలికలను అంతర్జాతీయ పోటీలల నిలపడమే ధ్యేయంగా “ డి లా వాలంటీనా సంస్థ ” విశేషంగా కృషి చేయడం చూసి వారితో ఓ పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని రీసెర్చ్ మీడియా గ్రూప్ చైర్మెన్ చైతన్య జంగా తెలిపారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం లిటిల్ మోడల్ ఎర్త్ 2019 టీజర్ ను ముఖ్యఅతిధిగా పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ రిడ్జ్ మన్చందా, వాలంటీనా మిశ్రా, రీసెర్చ్ మీడియా చైర్మన్ చైతన్య జంగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.విజయ్ వర్మ, సి. ఇవో.సి. హెచ్ హరిలీలా ప్రసాద్, డైరెక్టర్ లంకా నారాయణ తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com