ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జబర్ధస్త్ నుంచి రోజా అవుట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 07:16 PM

ప్రముఖ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇటీవల ఏపీ ఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక కాస్త బిజీ బిజీ గా మారారు. అటు నియోజకవర్గంలో తిరగటం, ఇటు చైర్మన్ గా పారిశ్రామిక వేత్తలు, అధికారులతో నిత్యం సమావేశాలు జరుపుతుండటంతో  ఇప్పటికే  సినిమాలకు దూరం అయిన ఆమె  జబర్ధస్త్ కామెడీ షో  కి కూడా గుడ్ బై చెప్పినట్టు సమాచారం. 

ఈ షోలో తన మార్క్ చూపించిన రోజా వచ్చే వారం ఎపిసోడ్‌ నుంచి తప్పుకున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోతో స్పష్టమైంది. గతంలో ఎన్నికల సమయంలో ఈ షోకి దూరంగా ఉన్నప్పుడు రోజా ప్లేస్ లో మీనా వచ్చిన విషయం తెలిసిందే. 



  





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com