ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుష్మా స్వరాజ్ రాజకీయ ప్రస్థానం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2019, 10:54 AM

సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 


-1977-82: హర్యానా శాసన సభకు తొలిసారి ఎన్నిక


-1977-79: హర్యానా ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి మంత్రిగా బాధ్యతలు


-1987-90: హర్యానా శాసనసభ సభ్యురాలిగా రెండోసారి ఎన్నిక


-1987-90: విద్య, ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు


-1990-96: రాజ్యసభకు తొలిసారి ఎన్నిక


-1996-97: 11వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా రెండోసారి: 1996 మే 15- 1997 డిసెంబర్4)


-1996: (మే 16 - జూన్ 1) కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు


-1998-99: 12వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా మూడోసారి: 1998 మార్చి 10- 1999 ఏప్రిల్ 26)


-1998: (మార్చి 19- అక్టోబర్ 12) కేంద్ర సమాచార, ప్రసారశాఖతోపాటు అదనంగా టెలీకమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలు


-1998: (అక్టోబర్ 13- డిసెంబర్ 3) ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి


-1998: (నవంబర్) హజ్ ఖాస్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక. అనంతరం రాజీనామా. లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగింపు


-2000-06: రాజసభ్యకు ఎన్నిక (ఎంపీగా నాలుగోసారి)


-2000-03: (2000 సెప్టెంబర్ 30- 2003 జనవరి 29) కేంద్ర సమాచార, ప్రసారశాఖ బాధ్యతలు


-2003-04: (2003 జనవరి 29- 2004 మే 22) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు


-2006-09: (2006 ఏప్రిల్) రాజ్యసభకు ఎన్నిక (ఎంపీగా ఐదోసారి)


-2009-14: (2009 మే 16- 2014 మే 18) 15వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఆరోసారి)


-2009-09: ( 2009 జూన్ 3 - 2009 డిసెంబర్ 21) లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేత


-2009-14: (2009 డిసెంబర్ 21- 2014 మే 18) లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ స్థానం భర్తీ


-2014-19: (2014 మే 26 నుంచి ) 16వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఏడోసారి)


-2014-19: (2014 మే 26- 2019 మే 29) కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com