ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జింక పిల్లకు పాలిచ్చిన మహిళ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2019, 04:35 PM

హైటెక్ యుగంలో పేగుతెంచుకుని పుట్టిన బిడ్డకు పాలిచ్చేందుకు మోడ్రన్ తల్లులు వెనుకంజ వేస్తుంటారు. అలాంటిది ఓ మహిళ జింకపిల్లకు పాలిచ్చి తనలోని తల్లి మమకారాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమెకు నలువైపుల నుంచి అభినందనలు, ప్రశంసలు వస్తున్నాయి.రాజస్థాన్ రాష్ట్రంలో బిష్ణోయి అనే గిరిజన తెగ ప్రజలు అధికంగా ఉన్నారు. ఈ తెగగు చెందిన మహిళ ఓ జింక పిల్లను దగ్గరకు తీసుకుని, జింక పిల్ల నోట్లో చనుమొనలను పెట్టి పాలిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కాగా, అది వైరల్ అయింది.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐఎఫ్ఎస్(ఇండియాన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి ప్రవీణ్ కశ్వాన్ ఈ ఫొటోను ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశారు. దీంతో ఈ చిత్రం మరింత పాపులర్‌గా మారిపోయింది. ఈ ఫొటోను చూసినవారంతా 'మానవత్వానికి మించి' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ఫోటో కింద అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్వీట్ చేస్తూ, "‘బిష్ణోయి తెగకు చెందినవారు ఎలాంటి వారో జోధ్‌పూర్‌లో తీసిన చిత్రం తెలియజేస్తుంది. ఈ ప్రియమైన జంతువులు చిన్నపిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఈ చిన్నారి జింకకు పాలుపట్టిన ఆ మహిళా మూర్తికి వందనాలు" అంటూ పేర్కొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com