మహారాష్ట్రలోని ... పుణెకు చెందిన ప్రేమ పాటిల్ అనే పోలీస్ ఆఫీసర్ అందాలపోటీలో పాల్గొనటమే కాదు ‘మిసెస్ ఇండియా’టైటిల్ గెలుచుకుని అందరితో ప్రశంసలందుకుంటోంది, తన వృత్తికి ఏమాత్రం పొంతన లేని ఈ ఈవెంట్లో పాల్గొని టైటిల్ గెలిచుకోన్న ఆమె గురించి వివరాలలోకి వెళితే... మహారాష్ట్ర... పుణెలోని కరాడ్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ప్రేమ పాటిల్ కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి కాగానే, పోలీస్ సెలక్షన్లలో ఎన్నికై, శిక్షణ పొంది 2010లో పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేరింది. తొలుత ముంబైలోని థానే పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఎన్నో కేసులను చాకచక్యంగా చేధించి శాఖాపరంగా అభినందనలతో పాటు ప్రమోషన్ అందుకున్నారు.
పూణేలోని స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన ఆమె, 2014లో విఘ్నేశ్ అనే ఆతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఆమెకు రెండేళ్ల కొడుకున్నాడు. ఓ వైపు వృత్తి మరోవైపు కుటుంబం బాధ్యతలు నిర్వహిస్తునే అందాలపోటీల్లో పాల్గొనాలన్న తన కాంక్షను ఎప్పటికప్పుడు నెరవేర్ఉచకునేందుకు తన భర్త సహాయం కూడా తీసుకుంది. ప్యాషన్‌పై ఆసక్తి పెంచుకుంటు, నెట్లోనూ, ఇతర విధాలుగా సంబంధిత సమాచారం తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసేది. ఇంట్లో ఉన్నప్పుడు వివిధ టివి ఛాన్ళలలో వచ్చే ర్యాంప్‌వాక్ చూస్తూ అలా నడటం, అందాల పోటీలో అడిగే ప్రశ్నలు ఎదుర్కొనేందుకు జనరల్ నాలెడ్జ్ కోసం దినపత్రికలు, పుస్తకాలు చదువటం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె జీ-20 సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ‘మిసెస్ ఇండియా’ పోటీలకు దరఖాస్తు చేసి, అర్హత సాధించింది. చివరి అంకంలో సుమారు 20 మంది మహిళలు పోటీపడ్డా, అన్ని అంశాలను తనదైన శైలిలో దాటుకుంటూ న్యాయనిర్ణేతలు అడిగిన పలు ప్రశ్నలకు చకచకా సమాధానాలిచ్చి ‘మిసెస్ ఇండియా’ టైటిల్ విజేత కాగలిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్ ఇండియా’ టైటిల్ గెలవడం పై ఆనందం వ్యక్తం చేసింది. “నా విజయం వెనుక నా భర్త ఉన్నాడు. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. చాలామంది మహిళలు రొటీన్ జీవితాన్ని గడుపుతుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మనలో దాగున్న ప్రతిభను చాటుకోవచ్చు అందుకు నేనే ఒక ఉదాహరణ’ టైటిల్ గెలుపుతో నేనొక సెలబ్రిటీగా మారానని ప్రేమ అన్నారు.