ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురపాలికల్లో అధికార పార్టీదే హవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2017, 01:34 AM

అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నవ్యాంధ్రలో జరిగిన పురపాలక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు విజేతలుగా నిలిచారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. ఎక్కువ చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్‌ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థిపై ఆయన 150 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. 


ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా గుడివాడ...


వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో జరిగిన ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైకాపాకు చెందిన వార్డు మెంబర్‌ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. తమ సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైకాపా, ఇక్కడ గెలిచి వైకాపాకు చెక్‌ పెట్టాలని తెలుగుదేశం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. చివరకు టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో వైకాపా శ్రేణులు నిరాశ చెందాయి. అలాగే చిత్తూరు 38 డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి వసంత్‌కుమార్‌ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎలమంచిలి మున్సిపాలీటీ 16వ వార్డులో టీడీపీ అభ్యర్థి వనం గీతా గ్రేస్‌ విజయం సాధించారు. మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డులో వైకాపా అభ్యర్థి రమణయ్య గెలుపొందారు. మాచర్ల 15 వార్డులో వైకాపా అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అంకారావు 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 16 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రవికు మార్‌ గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. చిత్తూరు 38 డివిజన్‌, ఎలమంచిలి మున్సిపాలీటీ , మాచర్ల 15 వార్డు, రామచంద్రా పురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.


చంద్రబాబు పాలనకు ఆమోదం: ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు,అన్నిస్థాయిల ఎన్నికల్లో విజయానికి తిరుగులేదని స్పష్టమవుతోంది.  మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిం చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని వివిధ మున్సిపా లిటీ వార్డుల ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు అత్యదిక స్థానాల్లో విజయభేరి మ్రోగించారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. ఎక్కువ చోట్ల తెదేపా అభ్యర్థులు విజయబా వుటా ఎగురవేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్‌ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థిపై ఆయన 150 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. వెకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడ లో జరిగిన ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 


టీడీపీ కైవసం చేసుకున్న 


మున్సిపల్‌ వార్డులు ఇవే


 అనంతపురం జిల్లా హిందూ పురం నియోజకవర్గం 9వ వార్డులో 939 ఓట్ల మెజార్టీ రాగా తాడిపత్రి నియోజకవర్గం 4వ వార్డులో 417 ఓట్ల మెజార్టీ లభించింది. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం 38వ డివిజన్‌ లో 1609 ఓట్ల మెజారిటీ, పలమ నేరు నియోజవర్గం 23వ వార్డులో 371 ఓట్ల మెజారిటీ లభించింది. అలాగే కర్నూలు జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం 2వ వార్డులో 399 ఓట్ల మెజారిటీ రాగా తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం నియోజకవర్గం 17వ వార్డులో 744 ఓట్ల మెజారిటీ రాగా 21వ వార్డులో 287 ఓట్ల మెజారిటీ. 25వ వార్డులో 566 ఓట్ల మెజారిటీ లభించింది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం 15వ వార్డులో 64 ఓట్ల మెజారిటీ, 19వ వార్డులో 817 మెజారిటీ  రాగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం 19వ వార్డులో 149 ఓట్ల మెజారిటీ లభించింది. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం 16వ వార్డులో 666 ఓట్ల మెజారిటీ లభించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం 7వ వార్డులో 187 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com