లోక్సభ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమైనట్లు సమాచారం. యూపీయే చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాహుల్ గాంధీ చర్చించిన సమయంలో ఆయన రాజీనామా లేఖను సమర్పించినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకోకపోవడంతోపాటు ఉత్తర ప్రదేశ్లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓటమిని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారని, మొదట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో చర్చించాలని సలహా ఇచ్చారని సమాచారం.