ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు మంత్రి పదవి రాకుండా ఓ నేత అడ్డుకున్నారు: ఉమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2017, 05:46 PM

కాపు కులస్తులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, ఈ విధంగా జరుగుతుండటం తమకు మామూలైపోయిందని మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఉమ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారని  ఆరోపించారు. దీంతో ఫలితాలు రావాల్సిన సమయంలో రాలేదని రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు  సమాధానంగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com