‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హిమ్మత్’, ‘ఘటక్’, ‘బార్డర్’ లాంటి చిత్రాలు సన్నీ డియోల్‌కు చాలా పేరును తెచ్చి పెట్టాయి. యుద్ధ నేపథ్యం ప్రధానంగా ఉండే ఈ సినిమాల్లో యాక్షన్ హీరోగా సన్నీ మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ అమృత్సర్ నుంచి బీజీపీ తరపున పోటీ చేయనున్నారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం న్యూఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలో కలుసుకున్నారు. అయితే పంజాబ్‌లోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే సన్నీ డియోల్‌ను అమృత్సర్ నుంచి పోటీ చేసేందుకు అమిత్‌షా ఒప్పించారని సమాచారం. అయితే దీనిపై సన్నీ డియోల్ భిన్నంగా స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, తాము మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటో తీసుకున్నారని అంతకు మించి మరేం లేదని ఆయన అన్నారు.