జమ్మూకాశ్మీర్: బారాముల్లా జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాబలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువైపులా జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది చనిపోయాడు. అతని మృతదేహాన్ని, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.