ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6,500 స్క్రీన్స్ లో విడుదల కానున్న బాహుబలి2

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 01:55 PM

బాహుబలి 2 ట్రైలర్ రికార్డు వ్యూస్ తో సంచలనాలు క్రియేట్ చేయగా, ఇక థియేట్రికల్ మూవీ గురించి అందరు చర్చలు చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఇండియా మొత్తంగా 6,500 స్క్రీన్స్ లో విడుదల చేయన్నారట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్ లో విడుదల కాలేదంటున్నారు. మరి నిజంగానే ఈ చిత్రం అన్ని స్క్రీన్స్ లో విడుదలైతే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయం. ప్రస్తుతం బాహుబలి2 చిత్రానికి సంబంధించి ఆడియో వేడుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 26న భారీ ఎత్తున రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాలలో ఈ ఆడియో వేడుకని నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com