మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ హయాంలో లిక్కర్ మాఫియాపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా పనిచేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో అనకాపల్లి జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.