ధర్మవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు.
పట్టణంలోని యువత తరలివచ్చి రక్తదానం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ. యువత తరలివచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సీఐలు నాగేంద్ర ప్రసాద్, రెడ్డెప్ప, తదితరులు పాల్గొన్నారు.