వేంసూరు మండల పరిధిలోని బీరపల్లి శివారులో ఆదివారం ఉదయం బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడటంతో తిరువూరు ఆస్పత్రికి తరలించారు. బస్సు సత్తుపల్లి నుంచి తిరువూరు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై వీరప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.