ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 11:24 AM

ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని ఉన్నవాళ్లకి ఒక శుభవార్త.  నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ  నేవీ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన పోస్టులు .  ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.ఛార్జ్ మ్యాన్ -1 పోస్టులు, చార్జ్ మ్యాన్ -10పోస్టులు, ఛార్జ్ మ్యాన్ -18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ -4 పోస్టులుఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.డ్రాఫ్ట్స్ మ్యాన్ 2 పోస్టులు, ఫైర్ మ్యాన్ 444 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 58 పోస్టులు, ట్రేడ్స్ మ్యాన్ మేట్ 161 పోస్టులు, పెస్ట్ కంట్రోల్ వర్కర్ 18 పోస్టులు, కుక్ 09 పోస్టులు, ఎంటిఎస్ 16 పోస్టులు . 


పోస్టును బట్టి అభ్యర్థులు పదవ తరగతి, 12వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలిసైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30ఏండ్లకు మించకూడదు. ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27ఏండ్ల లోపు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 -25 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3ఏండ్లు. దివ్యాంగులకు 10ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 5ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఆసక్తి, ఉన్నవారు 2024, ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com